V6 News

వారఫలాలు (ఏప్రిల్ 26–మే 2 ):ఈ వారం ఎవరికి ఎలా ఉంటుంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..! 

వారఫలాలు (ఏప్రిల్ 26–మే 2 ):ఈ వారం ఎవరికి ఎలా ఉంటుంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..! 

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (  ఏప్రిల్​ 26 నుంచి మే 2 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...

మేషరాశి :  ఈ రాశి వారు ఈ వారంలో  అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.  ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది.  . రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి.వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ఆదాయ ప్రయత్నాలన్నీ అనుకూలంగా ఉంటాయి.  నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. . ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.  ప్రేబ పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి. 

వృషభ రాశి :ఈ రాశి వారికి   గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు కలుగుతాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని ఆర్థిక, ఆదాయ సంబంధమైన సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలావరకు విముక్తి లభించి మానసికంగా ఊరట చెందుతారు.సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉన్నా, కుటుంబ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మిథున రాశి:  ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.  కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  పాత మిత్రులు కలుసుఉంటారు.  అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. వారం చివరిలో అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.   ఉద్యోగం మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఎలాంటి ఆందోళన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి:   ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ తో పాటు  జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి.  ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. కొందరు బంధు మిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆస్తి. ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు అండగా ఉంటారు. 

కన్యారాశి: ఈ వారం ఈ రాశి వారికి  ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువయ్యే అవకాశం ఉంది.  ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.  కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఆఫర్ లభించే అవకాశం ఉంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది.అనవసర ప్రయాణాలతో ఖర్చులు అధికమవుతాయి.  ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

తులారాశి :  ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఆస్తి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు.  వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి:  ఈ రాశికి చెందిన వారికి ఈ వారంలో ఎంతో కాలంగా పెండింగ్​ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి..  కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది.  వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్​..  ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

ధనుస్సు రాశి:  ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు పూర్తవుతాయి.  ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఊహించని ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.  రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి.  ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మకర రాశి :  ఈ  రాశి వారు ఈ వారం ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.  ఉద్యోగస్తులు జాబ్​ మారే అవకాశాలున్నాయి.  ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు.  కొత్త ప్రాజెక్ట్​లో ఒప్పందాలు కుదురుతాయి. చేతి  వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. .   సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆస్తి వివాదాలను పరిష్కరించు కుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  తలపెట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు.  ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.  

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. . వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల రెట్టింపు లాభాలుంటాయి. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  కుటుంబ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మీన రాశి:  రాశి వారికి ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి. కొత్తగా ఇల్లు నిర్మాణానికి వేసిన ప్లాన్​ సఫలం  అవుతుంది.  అనుకోకుండా కొన్ని కొత్త సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.